ఖమ్మం: వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని కలెక్టర్ తనిఖీ

50చూసినవారు
ఖమ్మం: వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని కలెక్టర్ తనిఖీ
ప్రజలకు ఆసౌకర్యం కలగకుండా వీధి వ్యాపారుల ప్రాంగణం అనువుగా ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయలు అమ్మే షెడ్లు, స్టాల్స్ పరిశీలించారు. ప్రాంగణం మొత్తం కలియతిరుగుతూ వ్యాపారులతో ముచ్చటించారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా. సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు.