ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శనివారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. ఇందులో కొన్ని ప్రభుత్వ సెలవులు ఉండగా, మిగతా రోజులు కలెక్టర్ సెలవు పెట్టారు. ఆయన తిరిగి విధుల్లో చేరేవరకు అదనపు కలెక్టర్ పి. శ్రీజకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి.