సోమవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను శాఖల వారీగా ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిశీలన చేసి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు.