ఖమ్మం: ప్రజావాణిలో కలెక్టర్ అర్జీల స్వీకరణ

1500చూసినవారు
ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ టిఎస్ దివాకర, అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కొణిజర్లలో పంచాయతీ పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చిన వినతిపై తహశీల్దార్ కు సూచనలు చేశారు. ఏన్కూరు రైతులు చెరువు నీటి సమస్యపై ఫిర్యాదు చేయగా, మోరీలు, కాల్వలు ఏర్పాటు చేయాలని డీపీవోను ఆదేశించారు. ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్