ఖమ్మం: గ్రామసభ నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

14చూసినవారు
ఖమ్మం: గ్రామసభ నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహణపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ గ్రామసభలలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా సమన్వయం చేసుకోవాలని, గత 2.5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్