ఖమ్మం: రబీ సీజన్ ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష

1చూసినవారు
ఖమ్మం: రబీ సీజన్ ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష
ఖమ్మం కలెక్టరేట్ లో సోమవారం యాసంగి (రబీ) 2025-26 సీజన్ ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు వివరాలు, రైతులకు జరిగే చెల్లింపులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసి, రైస్ మిల్లులకు తరలించి, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని, గన్ని బ్యాగులను మిల్లర్ల నుంచి పూర్తిగా సేకరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్