ఖమ్మం జిల్లాలో డిజిటల్ జనగణనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ దివాకర తెలిపారు. ప్రజలు మే 10లోపు ఆన్లైన్ ద్వారా తమ వివరాలను స్వీయ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా ఉందని, 110 లోడ్లు చేరుకున్నాయని పేర్కొన్నారు. వేసవి ఎండల దృష్ట్యా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు.