ఖమ్మం: వీబీజీ రామ్ జీ బిల్లు రద్దుకు 23న కలెక్టరేట్ ముట్టడి:

1చూసినవారు
వీబీజీ రామ్ జీ బిల్లును రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు బీకేఎంయు జిల్లా కార్యదర్శి సిద్ధినేని కర్ణకుమార్ తెలిపారు. శనివారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, ధర్నాలో కార్మికులు, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్