రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు, గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాలలను మూసివేసినట్లు వెల్లడించాయి. ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాసంస్థల చైర్మన్లు గుండాల కృష్ణ, మల్లెంపాటి శ్రీధర్, కాటేపల్లి నవీన్ బాబు, బొమ్మ రాజేశ్వరరావు, దరిపెల్లి కిరణ్ మాట్లాడుతూ, రూ. 700 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది.