ఖమ్మం: పరామర్శకు వచ్చి ఆనంత లోకాలకు

556చూసినవారు
ఖమ్మం: పరామర్శకు వచ్చి ఆనంత లోకాలకు
రఘునాథపాలెం మండలం బూడిదంపాడు వద్ద బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. పువ్వాడనగర్ కు చెందిన తేజావత్ వీరబాబు (30) లారీడ్రైవర్, ఆయన పిన్ని కుమారుడు భూక్యా విజయ్(33) కూలీగా జీవనం సాగిస్తున్నారు. కారేపల్లి మండలంలో వీరి బంధువు చనిపోవడంతో శుక్రవారం బైక్ పై పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. విజయ్ బస్సు వెనక టైర్ల కింద పడగా ముఖం నుజ్జునుజ్జ అయ్యింది.