ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్ దివాకర టీ. ఎస్. అధికారులు ప్రజలు అందించిన ఫిర్యాదులన్నీ ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం చేయొద్దని, సత్వరమే పరిష్కరించాలని, తిరస్కరిస్తే కారణాలు తెలియజేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.