ఖమ్మం కలెక్టర్ దివాకర టీ. ఎస్. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సింథటిక్ ట్రాక్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. లకారం ట్యాంక్ బండ్ వద్ద డ్రెయినేజీ పనులను, సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ను పరిశీలించారు. మిగిలిన పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఖిల్లా వద్ద రోప్ వే పనులను పరిశీలించి, లోయర్ స్టేషన్ పాయింట్, కేబిన్ల తయారీపై సూచనలు చేశారు.