ఖమ్మం: వేతనాలు ఇవ్వడం లేదని ఆందోళన

76చూసినవారు
ఖమ్మం: వేతనాలు ఇవ్వడం లేదని ఆందోళన
ఖమ్మం నగరంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న తమకు కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. టీయూసీఐ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ నాయకులు జి. రామయ్య, నరేష్, విష్ణు ఆధ్వర్యాన కార్మికులు కేఎంసీ ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు ఐదు నెలల పెండింగ్ వేతనాలు కాంట్రాక్టర్ ద్వారా ఇప్పించాలని కేఎంసీ కమిషనర్ ను కలిసి విన్నవించారు. ఏప్రిల్ నెల నుండి జీతాలు టిఎల్ఎఫ్ ద్వారా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్