ఖమ్మం: వైన్ షాప్ ను తొలగించాలని ఆందోళన

4చూసినవారు
ఖమ్మం ముస్తఫానగర్ లోని వైన్ షాప్ ను మూసివేయాలని స్థానికులు షాప్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై షాప్ ఉండడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని, మహిళలకు ఇబ్బందిగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాప్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో కార్పొరేటర్ పల్లా రోజ్ లీనా తదితరులు పాల్గొన్నారు.