ఖమ్మం: కాంగ్రెస్ తోనే బలహీనవర్గాలకు ప్రాధాన్యత

1చూసినవారు
ఖమ్మం: కాంగ్రెస్ తోనే బలహీనవర్గాలకు ప్రాధాన్యత
కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో బలహీన వర్గాలకే ప్రాధాన్యత దక్కుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీశ్రీ సర్కిల్ నుంచి భారీ ప్రదర్శనగా జెడ్పీ సెంటర్ కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, నూతి నివాళులర్పించారు. కాంగ్రెస్ లో పనిచేసిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని భట్టి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్