ఖమ్మం నగరంలోని నర్తకి ధియేటర్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ రోడ్ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని మేయర్ ను కోరారు. నెలలు తరబడి రహదారి పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కనీసం రోడ్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను కూడా తొలగించలేదన్నారు.