ఖమ్మం కార్పొరేషన్ అవినీతిపై విచారణ జరపాలి.. వై విక్రమ్

3చూసినవారు
ఖమ్మం కార్పొరేషన్ అవినీతిపై విచారణ జరపాలి.. వై విక్రమ్
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య వాహనాల డీజిల్ వినియోగంలో లక్షల రూపాయల దుర్వినియోగం జరిగిందని, దీనిపై జిల్లా మంత్రి, కమిషనర్ విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని సీపీఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య భవనంలో జరిగిన సీపీఎం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్