
మన దోశకు ప్రంపంచ గుర్తింపు.. టాప్ 50లో మూడు స్థానాలు
ప్రముఖ గ్లోబల్ ఫుడ్ గైడ్ 'టేస్ట్అట్లాస్' మే 2026కు విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 50 ఉత్తమ పాన్‌కేక్స్ జాబితాలో భారతీయ దోశలు మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మసాలా దోశ 6వ స్థానంలో (4.3 రేటింగ్), సాధారణ దోశ 15వ స్థానంలో (4.2 రేటింగ్), పేపర్ దోశ 35వ స్థానంలో (4.1 రేటింగ్) నిలిచాయి. లాట్వియాకు చెందిన 'కార్టుపెలు పంకుకాస్' మొదటి స్థానంలో ఉండగా, ఫ్రాన్స్, చైనా వంటకాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. భారతీయ రుచులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ దీని ద్వారా మరోసారి నిరూపితమైంది.




