ఖమ్మం: అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్

67చూసినవారు
ఖమ్మం: అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్
గురు పౌర్ణమి సందర్భంగా ఖమ్మం 6వ డివిజన్ ప్రశాంతి నగర్ సాయిబాబా మందిరంలో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు, అర్చనలు, సామూహిక పారాయణం చేసి స్వామివారి యొక్క గొప్పతనాన్ని చాటారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరావు ప్రారంభించి భక్తులకు వడ్డించారు. ఆలయ చైర్మన్ కొంటెముక్కల నాగేశ్వరరావు, సిద్ధార్థ సుబ్బారెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్