ఖమ్మం 53వ డివిజన్ సుల్తాన్ నగర్‌లో సీసీ డ్రైన్ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులకు మంగళవారం కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య శంకుస్థాపన చేశారు. ఈ పనులు ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని, వీటిని త్వరగా, నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని ఆమె అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు.