ఖమ్మం: పతకం సాధించిన కానిస్టేబుల్ ను అభినందించిన సీపీ

65చూసినవారు
ఖమ్మం: పతకం సాధించిన కానిస్టేబుల్ ను అభినందించిన సీపీ
అక్టోబర్ 20న ఢిల్లీలో జరిగిన వేదాంత హాఫ్ మారథాన్ రన్ లో కానిస్టేబుల్ పిల్లి రాజు పాల్గొని పతకం సాధించారు. గురువారం కానిస్టేబుల్ రాజును ఖమ్మం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సునీల్ దత్ అభినందించారు. కాగా మొత్తం 36, 000 మంది పాల్గొన్న హాఫ్ మారథాన్ రన్ లో కానిస్టేబుల్ పిల్లి రాజు 01: 53 నిమిషాలలో పూర్తి చేసి మెడల్ సాధించారు. మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకోని రావాలని సీపీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్