ఖమ్మం: ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట

0చూసినవారు
ఖమ్మం: ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 10వ తేదీ నుంచి పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు ప్రకటించారు. శనివారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్