రేపటి నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నష్టపోయిన ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేసి, మార్కెట్లో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. 11 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని, అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటామని, కేంద్రం సహకరించకపోయినా ప్రతి రైతుకు అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు.