ఖమ్మం: పంట బీమా పథకాన్ని అమలు చేయాలి

3చూసినవారు
రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో సమగ్ర పంట బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరిగిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వడగాళ్ల వానల వల్ల పంటలు నష్టపోయి ఆర్థికంగా కుంగిపోతున్న అన్నదాతలను ఆదుకునేందుకు ఈ బీమా పథకం ఎంతో దోహదపడుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్