ఖమ్మం టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఒక వినూత్నమైన పద్ధతిని అవలంబించారు. తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికపై సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముద్రించి, బంధుమిత్రులకు సామాజిక సందేశాన్ని అందించారు. ఆహ్వానంతో పాటు అవగాహన కల్పించే ఆయన బాధ్యతాయుతమైన ప్రయత్నాన్ని అధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రజల సొమ్ము సైబర్ నేరగాళ్ల బారిన పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు.