ఖమ్మం: తుఫాన్ ఎఫెక్ట్... ఇళ్లలోకి వస్తున్న విషసర్పాలు

5చూసినవారు
ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహంతో పాటు పాముల బెడదతో పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సారధినగర్, వెంకటేశ్వరనగర్, బొక్కలగడ్డ వంటి కాలనీల్లో గురువారం వరద నీరు ఇళ్లలోకి చేరడంతో పాటు పాములు కూడా చొరబడుతున్నాయి. ఇళ్లలో, వీధుల్లో పాములను చూసి ప్రజలు భయపడుతున్నారు. అధికారులు వెంటనే అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :