ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) చైతన్య జైనీ గుజరాత్‌లో జరగనున్న శిక్షణకు హాజరుకానున్నారు. ఈ నెల 4వ తేదీ (బుధవారం) నుంచి 8వ తేదీ వరకు గుజరాత్‌లో ఈ శిక్షణ జరగనుంది. ఈమేరకు ఆమె మంగళవారం బయలుదేరారు. చైతన్య జైనీ తిరిగి విధుల్లో చేరేవరకు డీఈఓ కార్యాలయ ఏడీ చావా శ్రీనివాసరావు ఇన్చార్జ్ డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.