ఖమ్మం జిల్లాలో ఇటీవల నలుగురు ఉపాధ్యాయులను డీఈఓ కార్యాలయానికి, ఒకరిని వయోజన విద్యా శాఖకు డిప్యుటేషన్ పై కేటాయించగా, దీనిపై విమర్శలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో, ఐదుగురు ఉపాధ్యాయులను వారి యథాస్థానాలకు తిరిగి కేటాయిస్తూ అదనపు కలెక్టర్, డీఈఓ శ్రీజ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యతో ఉపాధ్యాయ వర్గాల్లో కొంత ఉపశమనం లభించింది.