రాష్ట్రంలో డిప్యూటీ లేబర్ కమిషనర్ల బదిలీల్లో భాగంగా ఖమ్మం జిల్లాకు కొత్త అధికారి నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన కె. విజయభాస్కర్ రెడ్డి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జీహెచ్ఎంసీలో పర్సనల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఎం. కోటేశ్వర్లును ఖమ్మం డిప్యూటీ లేబర్ కమిషనర్ గా బదిలీ చేస్తూ కార్మిక శాఖ కమిషనర్ దాసరి హరిచందన ఉత్తర్వులు జారీ చేశారు.