రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, ఇంటింటా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఈ సూచనలు చేశారు. బూత్ లెవల్ అధికారులు టీ షర్ట్, టోపీ, గుర్తింపు కార్డు ధరించి ఓటర్లకు నేరుగా ఫారాలను అందజేయాలని తెలిపారు. ఈ సమీక్షలో కలెక్టర్ దివాకర్ జిల్లాలో ఫారాల పంపిణీ, సేకరణ వివరాలను వెల్లడించారు.