ఖమ్మం: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

2చూసినవారు
ఖమ్మం: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
ఖమ్మం జిల్లాలో మంగళవారం 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికైన 10 మంది అర్హులైన లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శించి, ఆయా శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రవాణా శాఖ రోడ్డు భద్రత అంశాలపై ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను కూడా ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్