స్థానిక సంస్థలలో 42% BC రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆద్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, BC నాయకులు హైదరాబాద్‌కు బయలుదేరారు. BC హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటానికి ఖమ్మం నుంచి మద్దతు తెలియజేయనున్నారు.