ఖమ్మం: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ప్రారంభం

0చూసినవారు
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపికకు పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ టి. ఎస్ దివాకర ప్రారంభించి, గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి ఎంపికలు దోహదపడతాయని, ప్రతిభావంతులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సునీల్ రెడ్డి, కోచ్ గౌస్ పాషా, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం. డీ. షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్