ఖమ్మం: 11న జిల్లాస్థాయి యువజనోత్సవాలు

1చూసినవారు
ఖమ్మం: 11న జిల్లాస్థాయి యువజనోత్సవాలు
ఖమ్మంలోని భక్తరామదాసు కళా క్షేత్రంలో ఈనెల 11న జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ టి. సునీల్ రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో జానపద నృత్యం, జానపదగేయాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పోస్టర్ పెయింటింగ్, కవిత్వం వంటి అంశాలు ఉంటాయి. 15-29 ఏళ్లలోపు వారు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ఆసక్తిగలవారు ఈనెల 10వ తేదీలోగా తమ ఎంట్రీలను అందజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్