జిల్లాలో పిసి పిఎన్డిటి చట్టం 1994, రూల్స్ 1996ను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా జడ్జి రాంప్రసాద రావుతో కలిసి ఆయన పిసి పిఎన్డిటి చట్టంపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కానింగ్ కేంద్రాలకు సంబంధించి 10 కొత్త దరఖాస్తులు, 11 రెన్యువల్ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ చట్టం అమలులో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.