మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంక్ లింకేజీ రుణాలు సకాలంలో తిరిగి చెల్లించేలా అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆమె ఖమ్మంలోని మహిళా మార్ట్ ను సందర్శించాక జిల్లా సమాఖ్య భవనంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, డీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. మహిళా సంఘాల సభ్యులు నగదు లావాదేవీలను డిజిటల్ విధానంలో చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు.