డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని అదనపు డీసీపీ బొజ్జా రామానుజం అన్నారు. ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రంలో 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' పేరుతో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన శిబిరంలో 150 మంది విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని, అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచించారు.