ఖమ్మం: రేపు స్లాట్ బుక్ చేసుకోవద్దు

0చూసినవారు
ఖమ్మం: రేపు స్లాట్ బుక్ చేసుకోవద్దు
తెలంగాణ కాటన్ మిల్లర్లు అండ్ ట్రేడర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయనున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులు స్లాట్ బుక్ చేసుకుని ఇబ్బంది పడొద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో మార్కెట్ చైర్మన్లు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం వెల్లడైంది. వ్యాపారుల నిర్ణయం దృష్ట్యా సీసీఐ కేంద్రాలతో పాటు ఖమ్మం, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లకు గురువారం రైతులు పత్తి తీసుకురావద్దని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్