సీపీఐ (ఎంఎల్) జిల్లా నాయకులు ఆవుల అశోక్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పరిష్కరించి సమానత్వం, సోషలిజాన్ని స్థాపించాల్సిన కమ్యూనిస్టు పార్టీలు అతివాద, మితవాద, అవకాశవాద ధోరణికి గురై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. శనివారం ఖమ్మంలో జరిగిన అమరవీరుల సంతాప సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ కాలం గడుపుతోందని ఆయన విమర్శించారు.