2026-27 విద్యా సంవత్సరానికి దోస్త్ ద్వారా డిగ్రీ ఫస్టియర్ లో చేరే ప్రక్రియ కొనసాగుతోందని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మొహ్మద్ జాకీరుల్లా తెలిపారు. మొదటి విడత ప్రవేశాల ఆన్ లైన్ గడువు నేటితో ముగియనుంది. వెబ్ ఆప్షన్స్ ఈ నెల 8 వరకు అందుబాటులో ఉంటాయి. రెండో విడత ప్రవేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.