ఖమ్మం: రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టరేట్లో డ్రా

1278చూసినవారు
ఖమ్మం: రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టరేట్లో డ్రా
ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ఖరారు కోసం డ్రా తీశారు. రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో జరిగిన ఈ డ్రాలో రిజర్వేషన్లు ప్రకటించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఆర్డీఓ జి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్ల డ్రా పూర్తయింది. అయితే, ఎంపీటీసీలు, సర్పంచ్లకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ రాత్రి పొద్దు పోయే వరకు కొనసాగింది.