ఖమ్మం: డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ షెడ్ పరిశీలన

68చూసినవారు
ఖమ్మం: డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ షెడ్ పరిశీలన
ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై నిర్మాణంలో ఉన్న డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ షెడ్ ను మంగళవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లకారం ట్యాంక్ బండ్ కు వచ్చే ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఎన్నారై సంస్థ వారి ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రారంభమవుతుందని మేయర్ వెల్లడించారు. వారితోపాటు డిఈ శ్రీనివాసులు, ఏఈ షామ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్