ఖమ్మం: 250 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

5చూసినవారు
ఖమ్మం: 250 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. బుధ, గురువారాల్లో జరిగిన ఈ తనిఖీల్లో నగర పరిధిలో 76 మంది, కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 250 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పట్టుబడిన వారందరిపై కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్