కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయడమే జార్జిరెడ్డికి ఘనమైన నివాళి అని పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు టి. లక్ష్మణ్ అన్నారు. ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన మహాసభలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల హక్కుల కోసం, శాస్త్రీయ విద్య, సమసమాజ స్థాపన ధ్యేయంగా ఎందరో విద్యార్థి ఉద్యమకారులు అమరులయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు.