మోంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనివల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పాటు ఒరిగిపోయాయి. మొత్తం 26 స్తంభాలు దెబ్బతినగా, వాటిలో 15 స్తంభాలను తిరిగి ఏర్పాటు చేశారు. ఈ తుపాను కారణంగా ఖమ్మం విద్యుత్ సర్కిల్‌కు సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.