ఓటర్లు ఇబ్బంది పడకుండా ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలతో పూర్తిచేయించాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ ఎన్నికల విభాగం ఆర్ఐ కొండల్ ను కోరారు. కేఎంసీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఆయన, ఫారాల పంపిణీలో కొందరు బీఎల్ఓలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఓటర్ల ఇంటికి వెళ్లకుండా ఒకే చోట కూర్చుని పిలిపిస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంపై అవగాహన కల్పించడం లేదని విక్రమ్ తెలిపారు.