ఖమ్మం: నైపుణ్యాల పెంపునకే ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్'

1238చూసినవారు
ఖమ్మం: నైపుణ్యాల పెంపునకే ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్'
ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. బట్టీ చదువులకు స్వస్తి పలికి, విద్యార్థుల్లో చదివే సామర్థ్యాలు పెంచేలా ఉపాధ్యాయులు బోధన పద్ధతి అవలంబించాలని ఆయన సూచించారు. పదాలను బోర్డుపై రాసి విద్యార్థులతో చదివించి, ఉచ్చారణపై సూచనలు చేశారు. ప్రతీ విద్యార్థికి చదివే సామర్థ్యం పెంచాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పక్కాగా అమలుచేయాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్