గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను అధికారులు పరిశీలిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీలు, రద్దీ ప్రాంతాల్లో గస్తీ, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అవసరమని ఆయన పేర్కొన్నారు.