ఖమ్మం: కుటుంబ కలహాలు.. ఇద్దరు ఆత్మహత్యాయత్నం

4చూసినవారు
ఖమ్మం: కుటుంబ కలహాలు.. ఇద్దరు ఆత్మహత్యాయత్నం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గౌరీ గూడెం గ్రామానికి చెందిన కాశిని, చంద్రాయపాలెం గ్రామానికి చెందిన రజిని వెంకటేశ్వరరావు శుక్రవారం ఈ దారుణానికి ఒడిగట్టారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సత్తుపల్లి 108 సిబ్బంది సంఘటనా స్థలాలకు చేరుకుని వైద్య సేవలు అందించి, వారిని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించిన 108 సిబ్బందిని గ్రామస్తులు, జిల్లా అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్