ఖమ్మం: ఆయిల్ పామ్ తో రైతులకు లాభాలు

3చూసినవారు
ఖమ్మం: ఆయిల్ పామ్ తో రైతులకు లాభాలు
రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని, తద్వారా ఏళ్ల తరబడి నికర ఆదాయం పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రఘునాథపాలెం రైతు వేదికలో ఉద్యాన పంటలపై ఏర్పాటుచేసిన రైతు సదస్సులో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగుతో 30 ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడి, ఆదాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్